MINISTERS MEET | రోడ్డు నిర్మాణ కోసం అటవీ అనుమతులలో నిర్లక్ష్యానికి తావు లేదు
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీమతి కొండా సురేఖ వెల్లడి
HYDERABAD | రాష్ట్ర ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం అని, అందుకు అటవీ అనుమతులు లేక ఆగిపోతే.. అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సచివాలయంలోని మంత్రి కొండా సురేఖ తో కలిసి అటవీ అనుమతులపై రివ్యూ నిర్వహించిన మంత్రి.. అటవీ అనుమతుల సాధనలో ఆలస్యంపై ఇద్దరు మంత్రులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా 7 రోడ్డు ప్రాజెక్టు పనులు, 4 సంవత్సరాలుగా 1 ప్రాజెక్టు, 3 సంవత్సరాలుగా 20 ప్రాజెక్టులు, గత సంవత్సర కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయన్నారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఇలాంటి రహదారులు అటవీ అనుమతులు లేక ఆగిపోవడం బాధాకరమని తెలిపారు. ఐదేండ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే ఇరు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ.. డిఎఫ్ఓల స్థాయిలో ఉన్న 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులతో చర్చించారు. ఆ తర్వాత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ లో అనవసర ఆలస్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హామి ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు తనకున్న పరిచయాలతో రాష్ట్రానికి అనేక రోడ్లను మంజూరీ చేయిస్తున్నారని.. అందుకు అనుగుణంగా అటవీ శాఖ నుంచి మరింత సహకారం అందించాల్సిన బాధ్యత మన భుజాలపైనే ఉందని అటవీ అధికారులకు ఆమే సూచించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ (డిజాస్టర్ మెనేజ్ మెంట్) హరీష్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, ఈఎన్సీ, సీఈ లతో పాటు మోర్త్ ఆర్ఓ కృష్ణప్రసాద్, ఇతర అటవీ, ఆర్ అండ్ బీ, ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు పాల్గొన్నారు.
* * *
Leave A Comment